నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Published Wed, Oct 18 2017 9:28 AM

Markets take a pause after 4-day rally 



సాక్షి, ముంబై:  దేశీ స్టాక్ మార్కెట్లు  ప్రతికూలంగా  ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్‌  92 పాయింట్లు కోల్పోయి 32,517 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 10,200 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.   నిఫ్టీకి 10,253-10,272 స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.

అమ్మకాల ఒత్తిడి,  కంపెనీ ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. బ్యాంకింగ్‌ రంగం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.  మెటల్‌  సెక్టార్‌  పాజిటివ్‌గా ఉంది. ముఖ్యంగా  యాక్సిస్‌ టాప్‌ లూజర్‌గాఉంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అలాగే అవెన్యూ  బ్లూ డార్ట్‌ నష్టపోతున్నాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌,  హిందాల్కో, విప్రో, టాటా  మోటార్స్‌  లాభపడుతున్నాయి. 
 

Advertisement
Advertisement